ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ABN , First Publish Date - 2020-12-30T05:40:03+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు సూచించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
తాతయ్యబాబును సత్కరిస్తున్న టీడీపీ నాయకులు

చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తాతయ్యబాబు


బుచ్చెయ్యపేట, డిసెంబరు 29: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు సూచించారు. బంగారుమెట్ట, ఎల్‌బిపీ.అగ్రహారం, ఎల్‌.సింగవరం, పొట్టిదొరపాలెం, చినఅప్పన్నపాలెం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు మంగళవారం తాతయ్యబాబును కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవరత్నాలు సంపూర్ణ స్థాయిలో ప్రజలకు అందడం లేదన్నారు. నిబంధనల పేరుతో పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా టీడీపీని పటిష్టం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు దొండా శ్రీను, తమరాన దాసు, దొడ్డి కిశోర్‌, సాయిం శేషు, దొండా వెంకటరమణ, బత్తుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:40:03+05:30 IST