-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » TDP CPM bike rally for formers
-
రైతులకు న్యాయం జరిగేవరకూ ప్రజాభిప్రాయ సేకరణ వద్దు
ABN , First Publish Date - 2020-11-25T06:47:15+05:30 IST
విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తిగా న్యాయం జరిగేవరకూ ప్రజాభిప్రాయ సేకరణ జరపకూడదని టీడీపీ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

తెలుగుదేశం, సీపీఎం నాయకుల డిమాండ్
ఉపమాక ఆలయం నుంచి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ
నక్కపల్లి, నవంబరు 24: విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తిగా న్యాయం జరిగేవరకూ ప్రజాభిప్రాయ సేకరణ జరపకూడదని టీడీపీ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉపమాక వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేశారు. అక్కడ రైతులను ఉద్దేశించి టీడీపీ, సీపీఎం నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్, ఎం.అప్పలరాజు మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రజలను ఒక దగ్గరకు చేర్చడం సరికాదన్నారు. పల్లె ప్రాంతాల్లో రసాయన, పెట్రో కెమిల్ ఫ్యాక్టరీలను నెలకొల్పకూడదని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు గింజాల లక్ష్మణరావు, రాజేశ్, గింజాల వెంకట రమణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.