-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » tdp agitation on tidcpo houses
-
టిడ్కో ఇళ్లను స్థానికేతరులకు ఇవ్వొద్దు
ABN , First Publish Date - 2020-12-19T06:16:49+05:30 IST
అనకాపల్లి పేదల కోసం నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్లను ఇతర ప్రాంతాలకు వారికి కేటాయిస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు.

టీడీపీ డిమాండ్.... జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన
అనకాపల్లి, డిసెంబరు 18: అనకాపల్లి పేదల కోసం నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్లను ఇతర ప్రాంతాలకు వారికి కేటాయిస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు. టిడ్కో ఇళ్లను గతంలో గృహప్రవేశం చేసిన వారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు, ఇళ్ల లబ్ధిదారులు శుక్రవారం ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుంచి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ, సత్యనారాయణపురంలో నిర్మించిన 2,520 గృహాల్లో 1,609 ఇళ్లను విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వారికి ఇవ్వాలని నిర్ణయించడం అన్యాయమని, దీనిని విరమించుకోకపోతే తీవ్రపరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం జోనల్ కార్యాలయం సూపరింటెండెంట్ అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీ పీ నాయకులు మళ్ల సురేంద్ర, బీఎస్‌ఎంకే జోగినాయుడు, ఆళ్ల రామచంద్రరావు, పోలారపు త్రినాథ్, ధనాల విష్ణుచౌదరి, సబ్బవరపు గణేశ్, దాడి జగన్, బొడ్డేడ మురళి, శంకర్ల దీపక్, కర్రి ప్రసాద్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.