విద్యాశాఖ మంత్రి కనిపించడం లేదు
ABN , First Publish Date - 2020-12-06T04:53:45+05:30 IST
‘రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కనిపించడం లేదు’ అంటూ టీఎన్ఎస్ఎఫ్ వ్యంగ్య పోస్టర్‌ను ఆవిష్కరించింది.

ఎద్దేవా చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ
మహారాణిపేట, డిసెంబరు 5: ‘రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కనిపించడం లేదు’ అంటూ టీఎన్ఎస్ఎఫ్ వ్యంగ్య పోస్టర్‌ను ఆవిష్కరించింది. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం దీన్ని ప్రదర్శించిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ మాట్లాడుతూ విద్యాశాఖలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని, ఆ శాఖ మంత్రి కూడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వర్సిటీల వీసీల నియామకాల్లో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీటవేసిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలను విస్మరించిందన్నారు. ఈ వర్గాల్లో ప్రతిభ ఉన్నవారెవరూ ప్రభుత్వానికి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. వీసీల నియామకంపై గవర్నర్ పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారిపోయిందని, ఇటువంటి పోకడ ఎప్పుడూ లేదని ఆరోపించారు.