-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » TDP
-
ధరలు అదుపు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2020-11-01T05:16:05+05:30 IST
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి విమర్శించారు.

విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి
మహారాణిపేట, అక్టోబరు 31: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మెడలో కూరగాయల దండలు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ధరల పరిస్థితి చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో హాయిగా జీవితాలు గడిపిన జనం ప్రస్తుత పరిస్థితి చూసి ఖిన్నులవుతున్నారన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని ప్రభుత్వం కూల్చివేతలు, కక్ష సాధింపు చర్యలతో బిజీగా ఉందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ధరల అదుపునకు చర్యలు చేపట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ మహిళా నాయకులు గనగళ్ల సత్యవతి, వెంకటలక్ష్మి, గోడి అరుణ, శ్యామల, భవాని, సంతోషి పాల్గొన్నారు.