‘తాండవ’ లక్ష్యం 70వేల టన్నులు

ABN , First Publish Date - 2020-12-18T05:05:08+05:30 IST

ఈ ఏడాది 70 వేల టన్నుల చెరకు క్రషింగ్‌ లక్ష్యంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తాండవ సహకార చక్కెర కర్మాగారం ఇన్‌చార్జి ఎండీ కేఆర్‌ విక్టర్‌రాజు తెలిపారు.

‘తాండవ’ లక్ష్యం 70వేల టన్నులు
పూజలు చేస్తున్న ఇన్‌చార్జి ఎండీ విక్టర్‌రాజు

  జనవరి మొదటి వారంలో క్రషింగ్‌ ప్రారంభం

 ఫ్యాక్టరీ ఇన్‌చార్జి ఎండీ విక్టర్‌రాజు

పాయకరావుపేట, డిసెంబరు 17 : ఈ ఏడాది 70 వేల టన్నుల చెరకు క్రషింగ్‌ లక్ష్యంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తాండవ సహకార చక్కెర కర్మాగారం ఇన్‌చార్జి ఎండీ కేఆర్‌ విక్టర్‌రాజు తెలిపారు.  క్రషింగ్‌ సీజన్‌ సన్నాహాల్లో భాగంగా గురువారం బాయిలర్‌ యూనిట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాయిలర్లను వెలిగించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ పరిధిలో 304 ఎకరాల్లో మొక్కతోట, 2,082 ఎకరాల్లో కార్సి తోటలు వేసిన రైతులతో అగ్రి మెంటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది మరో 16వేల టన్నుల చెరకు సరఫరా చేసేందుకు రైతులు ముందుకొచ్చినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 90 శాతం యంత్రాల ఓవర్‌ హాలింగ్‌ పనులు పూర్తిచేశామని, వచ్చే నెల మొదటి వారంలో చెరకు క్రషింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 

Updated Date - 2020-12-18T05:05:08+05:30 IST