చెట్టుకు ఉరివేసుకుని కారు డ్రైవర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-17T06:06:42+05:30 IST

‘తనపై తప్పుడు ప్రచారం వల్ల మానసిక క్షోభకు గురవుతున్నానని.., ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సెల్‌ ఫోన్‌లో వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టిమరీ ఓ కారు డ్రైవర్‌ చెట్టుకు ఉరి వేసుకొన్న ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నానికి ఏడు కిలోమీటర్ల దూరం గల గొలుగొండ పోలీసు స్టేషన్‌ పరిధి తోటలో బుధవారం చోటు చేసుకుంది.

చెట్టుకు ఉరివేసుకుని కారు డ్రైవర్‌ ఆత్మహత్య
కారు డ్రైవర్‌ జానీ (ఫైల్‌ ఫొటో)

 తనపై కొందరు తప్పడు ప్రచారం చేస్తున్నారని వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌

 నర్సీపట్నం, డిసెంబరు 16 : ‘తనపై తప్పుడు ప్రచారం వల్ల మానసిక క్షోభకు గురవుతున్నానని.., ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సెల్‌ ఫోన్‌లో వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టిమరీ ఓ కారు డ్రైవర్‌ చెట్టుకు ఉరి వేసుకొన్న ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నానికి ఏడు కిలోమీటర్ల దూరం గల గొలుగొండ పోలీసు స్టేషన్‌ పరిధి తోటలో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలివి.  నర్సీపట్నం రామారావుపేటకు చెందిన వాకా రమణమూర్తి (జానీ) (34) కారు డ్రైవర్‌గా పని చేస్తూ... జనసేన పార్టీ కార్యకర్తగా ఉత్సాహంగా తిరిగేవాడు. బుధవారం తన సెల్‌ఫోన్‌లో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, అందులో స్నేహితులు, బంధువులను చేర్చాడు. కొద్ది నిమిషాల్లో ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇద్దరు స్నేహితులు, దగ్గర బంధువైన మహిళ ఇందుకు కారణమని మెసేజ్‌ పెట్టాడు. తన భార్య, బంధువుల వద్ద తనపై చెడుగా ప్రచారం చేస్తున్నారని, మూడేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మెసేజ్‌ స్థానికంగా సంచలనం సృష్టించింది. అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితులు విస్తృతంగా గాలించారు. సాయంత్రం బయపురెడ్డిపాలెం- కశిమి రోడ్డులో ఏపీ టిడ్కో ఇళ్లు దాటిన తర్వాత మామిడితోటలో  ఉరి వేసుకున్నాడని స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ స్వామినాయడు, ఎస్‌ఐ రామారావు సంఘటనా స్థలానికి చెరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడింది కారు డ్రైవర్‌ జానీగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి, కేసును గొలుగొండ స్టేషన్‌కు బదిలీ చేశారు. 

 

Updated Date - 2020-12-17T06:06:42+05:30 IST