సర్వేలెన్స్‌ పక్కాగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-04-07T11:41:35+05:30 IST

జిల్లాలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాలలో సర్వేలెన్స్‌ పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ

సర్వేలెన్స్‌ పక్కాగా నిర్వహించాలి

మునిసిపల్‌, పట్టణాభివృద్ధి  శాఖ మంత్రి బొత్స


మహారాణిపేట: జిల్లాలో  కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాలలో సర్వేలెన్స్‌ పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి  శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం సర్క్యూట్‌ హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ సృజన, జాయింట్‌ కలెక్టర్లు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాలలో  పెద్దఎత్తున తనిఖీ బృందాలను ఇంటింటికీ పంపి సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజలలో ధైర్యం కలగాలని తెలిపారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ కేజీహెచ్‌లో కోవిడ్‌ 19 వైద్య పరీక్షలను ప్రారంభించామని, దీని ద్వారా రోజుకు 270 వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 

Read more