వార్డు వలంటీర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-08T05:23:55+05:30 IST

జీవీఎంసీ 98వ వార్డులో వార్డు వలంటీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వార్డు వలంటీర్‌ ఆత్మహత్య
మృతుడు శ్రీనివాసరావు (ఫైల్‌ ఫొటో)

సింహాచలం, నవంబరు 7: జీవీఎంసీ 98వ వార్డులో వార్డు వలంటీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోపాలపట్నం పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వార్డు పరిధి శిడగంవీధిలో తల్లి వరలక్ష్మి, సోదరులతో కలిసి ఉంటున్న బుగిడి శ్రీనివాసరావు (28) డిగ్రీ చదువుకుని ప్రస్తుతం వార్డు వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం ఉదయం పదిన్నరకు తలనొప్పిగా ఉందని చెప్పి తన రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. మధ్యాహ్నం రెండున్నరైనా భోజనానికి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు కొట్టారు. ఎంతకీ సమాధానం రాకపోవడంతో తలుపులు పగులకొట్టగా ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా శ్రీను కనిపించడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-08T05:23:55+05:30 IST