ఘనంగా శారదా పీఠంలో సుబ్రహ్మణ్య షష్ఠి

ABN , First Publish Date - 2020-12-21T05:10:21+05:30 IST

చినముషిడివాడలోని శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో ఆదివారం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా శారదా పీఠంలో సుబ్రహ్మణ్య షష్ఠి
సుబ్రహ్మణ్యస్వామికి హారతులిస్తున్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

పెందుర్తి, డిసెంబరు 20: చినముషిడివాడలోని శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో ఆదివారం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలో గల వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామికి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నక్షత్ర హారతులిచ్చారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈసందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సర్వస్వతి అనుగ్రహభాషణ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే సకల గ్రహ దోషాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయన్నారు. సాయంత్రం వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.


Updated Date - 2020-12-21T05:10:21+05:30 IST