రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-08-01T09:41:04+05:30 IST
కేంద్రం రూపొందించిన విద్యావిధానం కోసం దేశవ్యాప్తంగా అనేక వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలను పరిశీలించకుండా ..

ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.పైడిరాజు
విశాఖపట్నం, జూలై 31(ఆంధ్రజ్యోతి): కేంద్రం రూపొందించిన విద్యావిధానం కోసం దేశవ్యాప్తంగా అనేక వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలను పరిశీలించకుండా ముసారుదా అమలు చేయడం సరైందికాదని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.పైడిరాజు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. ముఖ్యంగా కొత్త విద్యా విధానం అమలుచేయాలంటే రాష్ట్రాలే కీలకమనే విషయం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
అందువల్ల రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని లేకపోతే అమలు సమయంలో సమస్యలు ఎదురవుతాయన్నారు. విద్యారంగానికి కేంద్రం భారీగా నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయరాదన్నారు. మూడో ఏట నుంచి 18 సంవత్సరాల వరకు విద్యను నాలుగుగా విభజించిన కేంద్రం, దాని అమలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన చేయాలని సూచించడం స్వాగతించాలన్నారు. దేశ వ్యాప్తంగా పది లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ముసాయిదాపత్రంలో తెలిపినందున, వాటిని భర్తీచేయకుండా గుణాత్మక విద్య ఎలా సాధ్యమవుతుందన్నారు.