నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-05-17T08:41:54+05:30 IST

గ్రామస్థులు ఎవరైనా కంటెయిన్‌మెంట్‌ జోన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ


చీడికాడ: గ్రామస్థులు ఎవరైనా కంటెయిన్‌మెంట్‌  జోన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఆదేశించారు. బైలపూడిలో ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకడంతో శనివారం మధ్యాహ్నం ఎస్‌పీ ఆ గ్రామాన్ని సందర్శించారు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల నివాస ప్రాంత పరిసరాలను పరిశీలించారు. గ్రామంలోకి ఇతరులు రాకుండా సరిహద్దులు మూసివేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టులను సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, అన్ని వాహనాలను తనిఖీ చేయాలన్నారు. వైరస్‌ సోకిన వలస కూలీలు గతంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆరా తీశారు. ఆయనతోపాటు అనకాపల్లి డీఎస్పీ కె.శ్రావణి, చోడవరం సీఐ కె.ఈశ్వరరావు, తహసీల్దార్‌ ఎస్‌వీ అంబేడ్కర్‌, డీటీ వై.శ్రీరామ్మూర్తి, ఎస్‌ఐ ఎల్‌.సురేష్‌కుమార్‌, ఈవోపీఆర్‌డీ ఎం.కామేశ్వరరావు పాల్గొన్నారు. 


సకాలంలో వైద్యం అందక బైలపూడి వాసి మృతి

చీడికాడ: మండలంలో బైలపూడి గ్రామానికి చెందిన గుంపెన రాము (58)కి సకాలంలో వైద్యం అందక శనివారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఈయన ఐదేళ్లుగా బోధకాలుతో బాధపడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ఈయనకు బీపీ డౌనై బాత్‌రూమ్‌లో పడిపోగా ఇంటో సపర్యలు చేయడంతో కాస్త కోలుకున్నాడు. శనివారం ఉదయం వలంటీర్లకు విషయం తెలిసిన వెంటనే 108కి ఫోన్‌ చేయగా వారు స్పందించలేదు. దీంతో  ఆటోలో తరలిస్తుండగా మృతి చెందినట్టు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పెదగోగాడ పీహెచ్‌సీ వైద్యాధికారి అప్పారావునాయుడు గ్రామానికి వెళ్లి తనిఖీ చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Updated Date - 2020-05-17T08:41:54+05:30 IST