-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » steelplant
-
‘26న కార్మిక సమ్మె విజయవంతం చేయండి’
ABN , First Publish Date - 2020-11-21T05:44:37+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది కార్మికులు ఈ నెల 26న తలపెట్టనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు.

ఉక్కుటౌన్‌షిప్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది కార్మికులు ఈ నెల 26న తలపెట్టనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ సీఎంఎస్ విభాగంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలకు అనుగుణంగా యాజమాన్యాలు వ్యవహరిస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. వైటీ దాసు, సింహాచలం, నీరుకొండ రామచంద్రరావు, ఎంఎన్ రెడ్డి, ఎం.దేముడు, ఎంకేఎన్.మూర్తి, నరేశ్, శ్రీనివాస్, దొమ్మేటి అప్పారావు, రామయ్య, బంటు రాము పాల్గొన్నారు.