కరోనా ఎఫెక్ట్‌తో చాన్నాళ్లకు మళ్లీ సందడి

ABN , First Publish Date - 2020-12-28T05:14:50+05:30 IST

ఐదవ రాష్ట్ర స్థాయి బాడీ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

కరోనా ఎఫెక్ట్‌తో చాన్నాళ్లకు మళ్లీ సందడి
పోటీలను ప్రారంభించిన అనంతరం వ్యాయామ పరికరాన్ని పరిశీలిస్తున్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు

రాష్ట్ర స్థాయి బాడీ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 27: ఐదవ రాష్ట్ర స్థాయి బాడీ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కరాసలో జరుగుతున్న ఈ పోటీలకు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఏడు విభాగాలలో జరిగే ఈ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్‌.ఎస్‌.శివశంకర్‌, గణేష్‌, రాజకీయ ప్రతినిధులు కామాక్షుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Read more