ఏటికొప్పాక షుగర్స్‌లో క్రషింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-30T06:10:44+05:30 IST
ఏటికొప్పాక చక్కెర కర్మాగారంలో రెగ్యులర్ క్రషింగ్ మంగళవారం ఉదయం 11.35 గంటలకు ప్రారంభమైంది.

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు హాజరు
ఎస్.రాయవరం, డిసెంబరు 29: ఏటికొప్పాక చక్కెర కర్మాగారంలో రెగ్యులర్ క్రషింగ్ మంగళవారం ఉదయం 11.35 గంటలకు ప్రారంభమైంది. అంతకు ముందు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు పూజలు నిర్వహించి, కేన్ క్యారియర్‌లో చెరకు గడలు వేసి క్రషింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు బకాయి జీతాలను వెంటనే చెల్లించేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ విషయమైన జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడతానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ మాజీ డైరెక్టర్లు రాజాబాబు, శంకరరావు, వైసీపీ నాయకులు సీతబాబు, పి.పెదఈశ్వరరావు, అద్దేపల్లి నూకినాయుడు, బాబీ తదితరులు పాల్గొన్నారు.