-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Srinivasa Rao and Srirammurthy as members of the DRUCC
-
డీఆర్‌యూసీసీ సభ్యులుగా శ్రీనివాసరావు, శ్రీరామ్మూర్తి
ABN , First Publish Date - 2020-12-28T04:35:35+05:30 IST
వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్‌యూసీసీ సభ్యుడిగా మాడుగుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనాథ శ్రీనివాసరావు, విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్‌యూసీసీ సభ్యునిగా చోడవరంనకు చెందిన బొడ్డు శ్రీరామ్మూర్తి నియమితులయ్యారు.

అనకాపల్లిటౌన్, డిసెంబరు 27: వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్‌యూసీసీ సభ్యుడిగా మాడుగుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనాథ శ్రీనివాసరావు, విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్‌యూసీసీ సభ్యునిగా చోడవరంనకు చెందిన బొడ్డు శ్రీరామ్మూర్తి నియమితులయ్యారు. వీరికి ఆదివారం ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి నియామక పత్రాలు అందజేశారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రైల్వే ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. అనంతరం సభ్యులను ఎంపీ దంపతులు సత్కరించారు.