రెల్వే స్పోర్ట్స్‌ వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2020-12-30T05:00:07+05:30 IST

తూర్పుకోస్తా రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్‌ వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యదర్శిగా అంతర్జాతీయ రైల్వే బాక్సింగ్‌ కోచ్‌ రెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు.

రెల్వే స్పోర్ట్స్‌ వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌
శ్రీనివాస్‌కు ఉత్తర్వులు అందజేస్తున్న స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ప్రదీప్‌ యాదవ్‌

విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 29: తూర్పుకోస్తా రైల్వే స్పోర్ట్సు అసోసియేషన్‌ వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యదర్శిగా అంతర్జాతీయ రైల్వే బాక్సింగ్‌ కోచ్‌ రెడ్డి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు వాల్తేరు డివిజన్‌ స్పోర్ట్సు అధికారి ప్రదీప్‌యాదవ్‌ మంగళవారం ఉత్తర్వులు అందజేశారు. శ్రీనివాసరావు నియామకాన్ని వాల్తేరు డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌, స్పోర్ట్సు అసోసియేషన్‌ అధ్యక్షుడు చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ ఆమోదించి అభినందించారు. ప్రతిష్ఠాత్మక  రైల్వే స్పోర్ట్సు ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) బాక్సింగ్‌ కోచ్‌గా, భారత  రైల్వే మహిళా బాక్సింగ్‌ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌ కీలక బాధ్యతలు చేపట్టడంపై స్పోర్ట్సు అధికారులు, క్రీడాంశాల కార్యదర్శులు, కోచ్‌లు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.


Updated Date - 2020-12-30T05:00:07+05:30 IST