క్రీడా సంఘాలు ఐక్యంగా మెలగాలి

ABN , First Publish Date - 2020-12-01T06:08:44+05:30 IST

నవంబరు 30: అన్ని క్రీడా సంఘాలు ఐక్యతగా ముందుకుసాగి, క్రీడల అభివృద్ధికి దోహదపడాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు

క్రీడా సంఘాలు ఐక్యంగా మెలగాలి
గణబాబును సత్కరించిన ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు

భారత వాలీబాల్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు

విశాఖపట్నం(స్పోర్ట్సు), నవంబరు 30: అన్ని క్రీడా సంఘాలు ఐక్యతగా ముందుకుసాగి, క్రీడల అభివృద్ధికి దోహదపడాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. భారత వాలీబాల్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ద ఒలింపిక్‌ సంఘం విశాఖ శాఖ సోమవారం పబ్లిక్‌ లైబ్రరీలో గణబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు, రాజకీయాలు భిన్న ధ్రువాలైనా అందరి ప్రోత్సాహంతో రెండు రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగడం ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రిటైర్డ్‌ ఎడిషనల్‌ ఎస్పీ టీఎస్‌ఆర్‌.ప్రసాద్‌, ఏయూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్సు సైన్సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.విజయమోహన్‌, ద ఒలింపిక్‌ సంఘం విశాఖ శాఖ అధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్‌, కార్యదర్శి ఎంవీ.మాణిక్యాలు, కోశాధికారి బి.రామయ్య, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఐ.వెంకటేశ్వరరావు, ఈ.ప్రసాదరావు, భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడు కంచరాన సూర్యనారాయణ తదితరులు గణబాబును ఘనంగా సత్కరించారు.





Updated Date - 2020-12-01T06:08:44+05:30 IST