వైసీపీ నాయకుల కబ్జాపై సీఎం పేషీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-10T05:44:44+05:30 IST

వైసీపీ నాయకులు తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ మండ లంలోని చోడపల్లికి చెందిన నీలం తాతలు అనే వృద్ధుడు ముఖ్యమంత్రి జగన్‌ కార్యాలయంలో ఇటీవల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపాల్సిందిగా అధికారుల నుంచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఆదేశాలు అందాయి.

వైసీపీ నాయకుల కబ్జాపై సీఎం పేషీకి ఫిర్యాదు

విచారణకు ఆదేశాలు రావడంతో పోలీసుల నుంచి వేధింపులు

 బాధిత కుటుంబం ఆరోపణ

అచ్యుతాపురం, డిసెంబరు 9 : వైసీపీ నాయకులు తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్నారంటూ మండ లంలోని చోడపల్లికి చెందిన నీలం తాతలు అనే వృద్ధుడు ముఖ్యమంత్రి జగన్‌ కార్యాలయంలో ఇటీవల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపాల్సిందిగా అధికారుల నుంచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఆదేశాలు అందాయి. దీంతో తమ కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారని తాతలు కుటుంబ సభ్యులు బుధవారం ఇక్కడి విలేఖర్ల వద్ద వాపోయారు. చోడపల్లి సర్వే నంబరు 135లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో ఇంటి స్థలాన్ని నీలం తాతలుకు కేటాయించారు. స్థోమత లేక ఆయన ఇంటిని నిర్మించకోలేదు. అయితే సదరు స్థలాన్ని ప్రస్తుతం వైసీపీ నాయకులు ఆక్రమించుకొని ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారన్నారు. దీనిపై స్థానిక పోలీసులకు గత నెల నవంబరు 19 ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, సరికదా సదరు వ్యక్తుల నుంచి తమ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని వివరించారు. దీంతో  చేసేది లేక సీఎం జగన్‌ పేషీలోని స్పందనలో ఫిర్యాదు చేసినట్టు తాతలు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు అధికారుల నుంచి ఆదేశాలు అందాయని,  ఈ నెల 5వ తేదీన తనను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి సీఎం పేషీకి ఎందకు దరఖాస్తు పెట్టావు.., నాలుగు రోజులుంటే మేమే పరిష్కారం చేసేవాళ్ల కదా.. అని ఎస్‌ఐ లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు బాధితుడు వాపోయారు.  అంతేకాకుండా ఇది సివిల్‌ కేసు కనుక సంతకం పెట్టమని బెదిరించారని ఆరోపించారు. దీనిపై తగిన న్యాయం చేయాలని ఉన్నతాధికారులను బాధితులు వేడుకున్నారు. 


Updated Date - 2020-12-10T05:44:44+05:30 IST