‘ఈ-స్పందన’కు 8 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2020-12-15T05:55:55+05:30 IST

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ-స్పందన కార్యక్రమానికి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి.

‘ఈ-స్పందన’కు 8 ఫిర్యాదులు
కార్యక్రమంలో పాలొగన్న ఏడీసీ ఆశాజ్యోతి, తదితరులు

వెంకోజీపాలెం, డిసెంబరు 14: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ-స్పందన కార్యక్రమానికి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. ఏడీసీ ఆశాజ్యోతి ఆయా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని మూడు రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ ఏవీ రమణి, సన్యాసిరావు, ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వరరావు, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వై.మంగపతిరావు, జేడీ విజయభారతి, తదితరులు పాల్గొన్నారు. 

Read more