19న ఎస్పీ బాలు స్వరాంజలి
ABN , First Publish Date - 2020-12-13T06:03:25+05:30 IST
వీవీ రమణ రైతుభారతి హాలులో ఈ నెల 19న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాంజలి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు డైమండ్ హిట్స్ చైర్మన్ దాడి రత్నాకర్ చెప్పారు.

అనకాపల్లి టౌన్, డిసెంబరు 12: వీవీ రమణ రైతుభారతి హాలులో ఈ నెల 19న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాంజలి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు డైమండ్ హిట్స్ చైర్మన్ దాడి రత్నాకర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. అనకాపల్లి డైమండ్ హిట్స్ సంస్థతో ఎస్పీ బాలుకు విడదీయరాని బంధం ఉందని రత్నాకర్ అన్నారు. కార్యక్రమంలో డైమండ్ హిట్స్ కోశాధికారి కర్రి దివాకర్, కళ్యాణి నృత్య సంగీత అకాడమీ కరస్పాండెంట్ ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.