-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » solar water schemes in tribal villages
-
270 గిరిజన గ్రామాల్లో సోలార్ ద్వారా తాగునీటి పఽథకాలు
ABN , First Publish Date - 2020-11-21T05:58:03+05:30 IST
ఏజెన్సీలోని 270 గ్రామాలకు సోలార్ ఆధారిత నీటి పథకాలు మంజూరయ్యాయి.

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని 270 గ్రామాలకు సోలార్ ఆధారిత నీటి పథకాలు మంజూరయ్యాయి. గతంలోనే 755 గ్రామాలకు సోలార్ ఆధారిత పథకాలు మంజూరుచేశారు. అయితే వీటిలో 270 గ్రామాల్లో బోర్లు వేయడానికి తగిన రహదారి సదుపాయం లేదు. ఆయా గ్రామాల్లో సోలార్ ఆధారిత నీటి పథకాలు ఏర్పాటుచేస్తామని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ వి.రవికుమార్ తెలిపారు. ఒక్కో పథకానికి రూ.ఏడున్నర లక్షలు వెచ్చిస్తామన్నారు. ఈ పథకం నుంచి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పారు.