కరోనాపై సామాజిక నిఘా పెంచాలి

ABN , First Publish Date - 2020-06-21T09:12:04+05:30 IST

జిల్లాలో కరోనా నివారణ, మరణాల రేటు తగ్గించడం, వ్యాధిపై సామాజిక నిఘాకు చేపట్టిన చర్యలను వేగవంతం చేయాలని జిల్లా

కరోనాపై సామాజిక నిఘా పెంచాలి

కంటెయిన్‌మెంట్‌ జోన్‌లలో సత్వరమే వైద్య పరీక్షలు

జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌


విశాఖపట్నం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా నివారణ, మరణాల రేటు తగ్గించడం, వ్యాధిపై సామాజిక నిఘాకు చేపట్టిన చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఉన్న వారికి ఆదివారం నాటికి వైద్య పరీక్షలు పూర్తి చేయాలన్నారు. వృద్ధులు, బీపీ, సుగర్‌, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి వైరస్‌ బాధితులను గుర్తించి చికిత్స అందించాలన్నారు.


అనారోగ్యంతో బాధపడే 60 ఏళ్లలోపు, పైబడిన వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. డీఆర్‌డీఏ, యూసీడీ, మెప్మా, స్వయం సహాయక సంఘాల వారికి పూర్తి అవగాహన కలిగించి తద్వారా సమూహాలను చైతన్యపర్చాలన్నారు.  ఇకపై జిల్లాలో ఒక్క కొవిడ్‌ మరణం కూడా సంభవించకూడదన్నారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, జాయింట్‌ కలెక్టర్లు అరుణ్‌ బాబు, గోవిందరావు, డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు, యూసీడీ పీడీ శ్రీనివాసరావు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.తిరుపతిరావు, జిల్లా ఆసుపత్రుల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మణరావు, జీవీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాస్ర్తి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-21T09:12:04+05:30 IST