డ్వాక్రా సంఘాలకు సామాజిక భవనం అప్పగింత

ABN , First Publish Date - 2020-12-20T05:12:58+05:30 IST

వేపగుంట రామాలయం సమీపంలో ఉన్న సామాజిక భవనాన్ని ఎట్టకేలకు స్థానిక డ్వాక్రా గ్రూపు మహిళలకు శనివారం అప్పగించారు.

డ్వాక్రా సంఘాలకు సామాజిక భవనం అప్పగింత
సామాజిక భవనాన్ని డ్వాక్రా గ్రూపు సభ్యులకు అప్పగిస్తున్న దృశ్యం

వేపగుంట, డిసెంబరు 19: వేపగుంట రామాలయం సమీపంలో ఉన్న సామాజిక భవనాన్ని ఎట్టకేలకు స్థానిక డ్వాక్రా గ్రూపు మహిళలకు శనివారం అప్పగించారు. ఇప్పటి వరకు ఈ సామాజిక భవనాన్ని వీఆర్వో, జీవీఎంసీ సిబ్బంది వినియోగించుకునేవారు. దీంతో ఈ ప్రాంతంలోని డ్వాక్రా గ్రూపులు, స్థానిక శ్రీరామ్‌ యూత్‌ సభ్యులు నెలవారీ సమావేశాలకు ఇబ్బంది పడేవారు.  స్థానిక వైసీపీ నాయకుడు ముమ్మన దేముడు ఈ విషయాన్ని ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆయన స్పందించి యూసీడీ అధికారులతో మాట్లాడి ఈ భవనాన్ని డ్వాక్రా గ్రూపు సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ భవనాన్ని అధికారులు డ్వాక్రా సభ్యులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తామర్ల నరసింగ్‌, సంతోశ్‌, కుమార్‌, శ్రీరామ్‌ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:12:58+05:30 IST