-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » SOBHANAIDU
-
తీరంలో శోభానాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2020-11-26T04:31:02+05:30 IST
కూచిపూడి నృత్యానికి ఖండాంతర ఖ్యాతి తెచ్చేందుకు కృషి చేసిన దివంగత డాక్టర్ కె.శోభానాయుడు కాంస్య విగ్రహాన్ని సాగరతీరంలో ఏర్పాటు చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉత్తరాంధ్ర కళాకారుల ఐక్యవేదిక, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (అప్తా) సంయుక్త ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.

ఉత్తరాంధ్ర కళాకారుల ఐక్య వేదిక విజ్ఞప్తి
సిరిపురం, నవంబరు 25: కూచిపూడి నృత్యానికి ఖండాంతర ఖ్యాతి తెచ్చేందుకు కృషి చేసిన దివంగత డాక్టర్ కె.శోభానాయుడు కాంస్య విగ్రహాన్ని సాగరతీరంలో ఏర్పాటు చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉత్తరాంధ్ర కళాకారుల ఐక్యవేదిక, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (అప్తా) సంయుక్త ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ముందుగా ఐక్య వేదిక కన్వీనర్ చెన్నా తిరుమలరావు, చక్కా రమాదేవి, ఎ.లక్ష్మీరెడ్డి, బొడ్డేటి జగత్‌రావు, మహమ్మద్ షకీల్ జ్యోతి ప్రజల్వన చేసి శోభానాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం చెన్నా తిరుమలరావు మాట్లాడుతూ వివిధ కళారంగాలకు చెందిన ప్రముఖుల విగ్రహాలతో అలరారే విశాఖ సాగరతీరంలో నాట్యకళకు చెందిన ఏ ఒక్కరికీ స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. అందువల్ల ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ శోభానాయుడు విగ్రహాన్ని తీరంలో ఏర్పాటు చేసి ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే అప్తా ద్వారా విగ్రహాన్ని అందిస్తామని అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐక్యవేదిక కో-కన్వీనర్ బి.సత్యమాధవి, ఎన్‌ఏ రాజు, మళ్ల లక్ష్మి, ఎస్.రామలక్ష్మి, కె.కల్యాణి, తదితరులు పాల్గొన్నారు. కాగా దీక్షా శిబిరంలో దివ్యవాణి, కాత్యాయిని, సంజన కూచిపూడి నృతాన్ని, ఎం.విజయలక్ష్మి వీణా వాయిద్య కచేరి, వైకే రాజు మిమిక్రీ, లక్ష్మీరెడ్డి బృందం కోలాటం ప్రదర్శనలిచ్చారు.