నాగుపాము కలకలం

ABN , First Publish Date - 2020-12-16T05:18:06+05:30 IST

మల్కాపురం ఎస్సీ కాలనీలోని ఓ ఇంట్లోకి మంగళవారం గోధుమ రంగులో ఉన్న నాగుపాము ప్రవేశించింది.

నాగుపాము కలకలం
మంచంపై ఉన్న పామును పట్టుకుంటున్న దృశ్యం

మల్కాపురం, డిసెంబర్‌ 15 : మల్కాపురం ఎస్సీ కాలనీలోని ఓ ఇంట్లోకి మంగళవారం గోధుమ రంగులో ఉన్న నాగుపాము ప్రవేశించింది. ఇంట్లోని మంచంపై ఉండడంతో ఆ ఇంటి పెద్ద లక్ష్మమ్మ చూసి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. ఈ విషయాన్ని స్థానిక యువకులు స్నేక్‌ క్యాచర్‌ నాగరాజుకు తెలిపారు. ఆయన వెంటనే వచ్చి ఆ నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు.  దానిని గోనె సంచిలో బంధించి దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో విడిచి పెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడైనా పాము కనిపిస్తే 7569135128 నంబర్‌కు ఫోన్‌ చేస్తే తాను వస్తానని నాగరాజు తెలిపారు.

Updated Date - 2020-12-16T05:18:06+05:30 IST