రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు అప్పన్న దర్శనాలు నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-16T06:55:37+05:30 IST

ఈ నెల 25న నూతన తెలుగు వత్సరాది శార్వరి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో కోవెల ఆళ్వార్‌ తిరుమంజనం (స్వామివారి ప్రధాన ఆలయ గర్భగుడి శుద్ధి) సేవ నిర్వహిస్తున్నట్టు దేవస్థానం ఈవో మారెళ్ల వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు అప్పన్న దర్శనాలు నిలిపివేత

సింహాచలం, మార్చి 15: ఈ నెల 25న నూతన తెలుగు వత్సరాది శార్వరి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో కోవెల ఆళ్వార్‌ తిరుమంజనం (స్వామివారి ప్రధాన ఆలయ గర్భగుడి శుద్ధి) సేవ నిర్వహిస్తున్నట్టు దేవస్థానం ఈవో మారెళ్ల వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవెల ఆళ్వార్‌ తిరుమంజ సేవను నిర్వహించ నున్నందున మంగళవారం మధ్యాహ్నం రాజభోగం నివేదన తర్వాత మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. కాఆ ఆరోజు ఉదయం ఎఇమిది గంటలకు సింహగిరిపై కరోనా వైర్‌సపై ఆలయ సిబ్బందికి, భక్తులకు అవగాహన కలిపించేందుకు దేవస్థానం పాలకమండలి చైర్‌పర్సన్‌ పి.సంచయిత గజపతిరాజు అధ్యక్షతన ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-03-16T06:55:37+05:30 IST