సింహాచలంలో ఇత్తడి కానుకలు మాయం

ABN , First Publish Date - 2020-10-13T12:48:50+05:30 IST

సింహాచలం అప్పన్న ఆలయంలో ఇత్తడి కానుకలు మాయం కలకలం రేపుతున్నాయి.

సింహాచలంలో ఇత్తడి కానుకలు మాయం

విశాఖపట్నం: సింహాచలం అప్పన్న ఆలయంలో ఇత్తడి కానుకలు మాయం కలకలం రేపుతున్నాయి. భక్తులు హుండీలో సమర్పించిన 550 కేజీల ఇత్తడి కానుకలు మాయంపై గందరగోళం నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఇది ఇంటి దొంగల పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సహకారంతోనే ఇక్కడి కానుకలు బయటకు వెళ్లినట్లు సమాచారం. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సింహాచంలో ఇత్తడి కానుకల మాయంపై సీపీ మనీష్కుమార్ సిన్హా సీరియస్ అయ్యారు. Updated Date - 2020-10-13T12:48:50+05:30 IST