అనకాపల్లి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా షఫీ

ABN , First Publish Date - 2020-12-20T05:10:58+05:30 IST

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పెందుర్తికి చెందిన షేక్‌ షఫీఉల్లా నియమితులయ్యారు.

అనకాపల్లి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా షఫీ
నియమాక ఉత్తర్వులు అందుకుంటున్న షఫీ

పెందుర్తి, డిసెంబరు 19: అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పెందుర్తికి చెందిన షేక్‌ షఫీఉల్లా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం తిరుపతిలో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి నుంచి షఫీ నియామక ఉత్తర్వులు అందుకున్నారు. 

Read more