440 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-28T04:53:57+05:30 IST

ఒడిశా నుంచి మహరాష్ట్రకు లారీలో తరలిస్తున్న గంజాయిని మాడుగుల పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

440 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల పోలీసులు పట్టుకున్న గంజాయి


ఇద్దరి అరెస్ట్‌, లారీ సీజ్‌


మాడుగుల రూరల్‌, డిసెంబరు 27: ఒడిశా నుంచి మహరాష్ట్రకు లారీలో తరలిస్తున్న గంజాయిని మాడుగుల పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ పి.రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని డి.సురవరం వద్ద ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాడేరు నుంచి వస్తున్న లారీని ఆపారు. అందులో కొబ్బరి చిప్పలు బస్తాలు ఉన్నాయి. కొబ్బరి బస్తాల మాటున గంజాయి బస్తాలు వెలుగుచూశాయి. దీంతో గంజాయిని తరలిస్తున్న మహరాష్ట్రకు చెందిన ఇద్దరిని అరెస్ట్‌ చేసి, లారీని స్టేషన్‌కి తరలించారు.  నిందితులపై కేసు నమోదు చేసి లారీ సీజ్‌ చేశామని చెప్పారు.  


Updated Date - 2020-12-28T04:53:57+05:30 IST