378 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-13T06:19:01+05:30 IST

మండల కేంద్రంలోని పన్నేడ గ్రామ సమీపంలో 378 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ పి.రాజారావు తెలిపారు. శనివారం వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ముంచంగిపుట్టు నుంచి మైదాన ప్రాంతానికి వెళుతున్న వ్యాన్‌ డ్రైవర్‌ వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడన్నారు.

378 కిలోల గంజాయి పట్టివేత
పట్టుబడిన గంజాయి బస్తాలు


కూరగాయల మధ్య రవాణా

వ్యాన్‌ సీజ్‌.. డ్రైవర్‌ పరారీ

పెదబయలు, డిసెంబరు 12: మండల కేంద్రంలోని పన్నేడ గ్రామ సమీపంలో 378 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ పి.రాజారావు తెలిపారు. శనివారం వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ముంచంగిపుట్టు నుంచి మైదాన ప్రాంతానికి వెళుతున్న వ్యాన్‌ డ్రైవర్‌ వాహనాన్ని విడిచి వెళ్లిపోయాడన్నారు. తమ సిబ్బంది వాహనాన్ని తనిఖీ చేయగా కూరగాయలు ట్రేల మధ్యలో 378 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. వాహనాన్ని సీజ్‌ చేసినట్టు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ రాజారావు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 


Updated Date - 2020-12-13T06:19:01+05:30 IST