160 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST

ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదానానికి కారులో తరలిస్తున్న గంజాయిని మాడుగుల ఎస్‌ఐ పి.రామారావు పట్టుకున్నారు.

160 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి స్వాధీనం చేసుకున్న మాడుగుల పోలీసులు


మాడుగుల రూరల్‌, డిసెంబరు 13: ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదానానికి కారులో తరలిస్తున్న గంజాయిని మాడుగుల ఎస్‌ఐ పి.రామారావు  పట్టుకున్నారు. శనివారం సాయంత్రం డి.సురవరం వద్ద వాహన తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న 160 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులను గమనించిన గంజాయి రవాణాదారులు కారుని వదిలి పరారయ్యారన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని కారు సీజ్‌ చేశామని, నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.

Updated Date - 2020-12-13T05:30:00+05:30 IST