అంతర్రాష్ట్ర రహదారిని పరిశీలించిన ఎస్‌ఈ
ABN , First Publish Date - 2020-12-29T05:34:24+05:30 IST
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అంతర్రాష్ట్ర రహదారిని పంచాయతీరాజ్ ఎస్‌ఈ జి.సుధాకరరెడ్డి సోమవారం పరిశీలించారు. సీలేరు వై.జంక్షన్ నుంచి ఆంధ్రా బోర్డరు కాంట్రగెడ్డ వరకు గల 6.6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.4.55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
సీలేరు, డిసెంబరు 28: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అంతర్రాష్ట్ర రహదారిని పంచాయతీరాజ్ ఎస్‌ఈ జి.సుధాకరరెడ్డి సోమవారం పరిశీలించారు. సీలేరు వై.జంక్షన్ నుంచి ఆంధ్రా బోర్డరు కాంట్రగెడ్డ వరకు గల 6.6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.4.55 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఇటీవలే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ మేరకు పీఆర్ ఎస్‌ఈ పాడేరు డివిజన్ పరిధిలోని అధికారులతో కలసి రహదారిని పరిశీలించారు. నాణ్యతా లోపాలు లేకుండా నిర్ధేశించిన సమయంలో పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎస్‌ఈ సూచించారు. అనంతరం ధారకొండ-గుమ్మిరేవుల రహదారి పనులను పరిశీలించారు. ఆయన వెంట పాడేరు పంచాయతీరాజ్ ఈఈ కె.శ్రీనివాస్, డీఈఈ కళ్యాణ్‌కుమార్, జేఈఈ జీవీఎస్ ప్రకాష్ ఉన్నారు.