భద్రతా చర్యలు కట్టుదిట్టం
ABN , First Publish Date - 2020-05-09T07:22:54+05:30 IST
ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదంపై నిపుణుల కమిటీతో విచారణ జరిపి, భద్రతా చర్యలు
ముఖ్యమంత్రి ఆదేశాలు
మహారాణిపేట(విశాఖపట్నం), మే 8: ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదంపై నిపుణుల కమిటీతో విచారణ జరిపి, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ముఖ్యమంత్రి అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్‌డీఆర్‌ఎఫ్, స్థానిక సాంకేతిక నిపుణుల బృందం నిరంతర కృషితో గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చినట్టు ముఖ్యమంత్రికి వివరించారు. 50 శాతం కెమికల్ పాలిమరైజ్ అయ్యిందని, మిగిలినది మరో 24 గంటలలో అవుతుందని వివరించారు. ఫ్యాక్టరీలో చిన్నచిన్న ట్యాంక్‌లు భద్రంగా ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు.