ఏజెన్సీలో కొత్త స్కూళ్లు

ABN , First Publish Date - 2020-11-07T06:37:27+05:30 IST

ఏజెన్సీలోని 33 గ్రామాల్లో కొత్తగా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేస్తున్నారు.

ఏజెన్సీలో కొత్త స్కూళ్లు

33 గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు


విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని 33 గ్రామాల్లో కొత్తగా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇవి పనిచేస్తాయి. త్వరలో ఈ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించనున్నారు. ప్రస్తుతానికి ఆయా గ్రామాల్లో ఇతర శాఖలకు చెందిన భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తామని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. టీచర్ల నియామకం తరువాత విద్యార్థులను చేర్చుకుంటామని చెప్పారు. అత్యధికంగా పెదబయలు మండలానికి తొమ్మిది, చింతపల్లికి ఎనిమిది పాఠశాలలు మంజూరు అయ్యాయి. అనంతగిరికి నాలుగు, ముంచంగిపుట్టుకు మూడు, పాడేరు, కొయ్యూరు, జీకే వీధిలకు రెండేసి; అరకులోయ, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండ లాలకు ఒక్కొక్క పాఠశాల చొప్పున కేటాయించారు. 

పాఠశాలలు ఏర్పాటుకానున్న గ్రామాలు...

పెదబయలు మండలం చీడిపుట్టు, పెదపాడు, గజ్జెడి, తుంగపాడు, సాలెబులు, కణుసులమెట్ట, బొడ్డంగి, బల్ల్లపురం, పెదకొండ; చింతపల్లి మండలం లుబ్బగుంట, బొర్రమామిడి, ములగ్గూరు,పాలమామిడి, నిమ్మల పాలెం, గున్నమామిడి, గడ్డిబంద, జాదగురు; అనంతగిరి మండలం శిసమంద, మద్దిపాడు, పుట్టికపుట్టు, బుడ్డిగరువు; ముంచంగి పుట్టు మండలం మినుములపుట్టు, దొరగుడ, లక్ష్మీపురం; జీకే వీధి మండలం మందిగెడ్డ, వలసపల్లి; పాడేరు మండలం బరిడిపుట్టు, జీడిపాగుడు; కొయ్యూరు మండలం  కొర్రపాడు,కుమ్మర్లబంద; అరకులోయ మండలం  పూజారిగుడ, డుంబ్రిగుడ...కిన్నంగుడు, జి.మాడుగుల...గుర్రాలగుమ్మి.


Updated Date - 2020-11-07T06:37:27+05:30 IST