‘ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి’
ABN , First Publish Date - 2020-12-30T04:52:27+05:30 IST
ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో ఎస్సీలంతా బుద్ధి చెబుతారని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల చైౖర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు.
సీతంపేట, డిసెంబరు 29: ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో ఎస్సీలంతా బుద్ధి చెబుతారని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల చైౖర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ చేశారు. ద్వారకానగర్ విశాఖ పౌరగ్రంథాలయంలో ఎమ్మార్పీఎస్ నేత పెద్దాడ రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో పెడతామని ప్రకటించినా చర్యలు లేవన్నారు. ఉమ్మడి రిజర్వేషన్‌తో తీవ్రంగా నష్టపోయిన మాదిగలకు రానున్న బడ్జెట్‌లో 10 వేల కోట్లు కేటాయించాలన్నారు. లిడ్‌క్యాప్‌ను పునరుద్ధరించి, చైర్మన్‌గా మాదిగలను నియమించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహిస్తామని, అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తిరుపతి పార్లమెంట్ సీటును అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు కేటాయించాలన్నారు. దాడులను నియంత్రించడంలో విఫలమవడంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి దళిత వ్యతిరేకిగా మారారన్నారు. ఈ కార్యక్రమంలో జామి రాజు, సిద్ధు, ఎం.అప్పలరాజు, గోపి తదితరులు పాల్గొన్నారు.