సౌదీ నుంచి వచ్చిన వ్యక్తి గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2020-03-24T09:15:06+05:30 IST

అబుదాబి (సౌదీ) నుంచి పెదవలస వచ్చిన ఓ వ్యక్తికి పధ్నాలు రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండాలని నోటీసు జారీచేసినట్టు స్థానిక...

సౌదీ నుంచి వచ్చిన వ్యక్తి గృహ నిర్బంధం

గూడెంకొత్తవీధి, మార్చి 23 : అబుదాబి (సౌదీ) నుంచి పెదవలస వచ్చిన ఓ వ్యక్తికి పధ్నాలు రోజులపాటు గృహ నిర్బంధంలో ఉండాలని నోటీసు జారీచేసినట్టు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ధీరజ్‌ తెలిపారు. గ్రామానికి సౌదీ నుంచి నాలుగు రోజుల కిందట వచ్చాడని ఆశ కార్యకర్త ద్వారా సమాచారం తెలుసుకున్న వైద్యాధికారి హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌రావుతో కలిసి అతని గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి విలేఖర్లతో మాట్లాడుతూ సౌదీ నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. అతనిలో కరోనా వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నారు. దీంతో పధ్నాలుగు రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని సూచిం చామన్నారు. 

Read more