-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » rural sp krishnarao
-
ప్రజల సహకారం లేనందునే హత్యలు చేస్తున్నారు
ABN , First Publish Date - 2020-12-19T06:05:17+05:30 IST
ప్రజల సహకారం లేకపోవడంతో మావోయిస్టులు హత్యలు, దాడులకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు.

మావోలపై జిల్లా ఎస్పీ కృష్ణారావు విమర్శ
అనకాపల్లిటౌన్, డిసెంబరు 18: ప్రజల సహకారం లేకపోవడంతో మావోయిస్టులు హత్యలు, దాడులకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్లకు కేటాయించిన బ్లూకోల్ట్స్ వాహనాలను అనకాపల్లి డీఎస్పీ కె.శ్రావణి చేతులమీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, మన్యం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, పోలీస్ శాఖ చేస్తున్న కార్యక్రమాలను వారు స్వాగతిస్తున్నారని అన్నారు. గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పలు శాఖలతో తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు కె.శ్రావణి, పి.శ్రీనివాసరావు, సీఐలు ఎల్.భాస్కరరావు, జి.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.