దోమలజోరు రహదారిని పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-11-06T06:02:16+05:30 IST

విశాఖ జిల్లా అరకు మండలంలోని మాదల పంచాయతీ దోమలజోరు-కమలతోట రహదారిని పూర్తిచేయాలని పలు గ్రామాల గిరిజనులు గురువారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

దోమలజోరు రహదారిని పూర్తిచేయాలి
దోమలజోరు రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజనులు

పలు గ్రామాల గిరిజనుల నిరసన

అరకులోయ, నవంబరు 5: విశాఖ జిల్లా అరకు మండలంలోని మాదల పంచాయతీ దోమలజోరు-కమలతోట రహదారిని పూర్తిచేయాలని పలు గ్రామాల గిరిజనులు గురువారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, గ్రామ కార్యదర్శి కె.రమేశ్‌ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్డును నేటి వరకు పూర్తి చేయలేదన్నారు. గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు కూడా పూర్తి కాలేదన్నారు. రోడ్డు లేకపోవడంతో 108, 104 వాహనాలు కూడా రావడం లేదన్నారు. ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ స్పందించి తమ ప్రాంతానికి రోడ్డు వేయించాలని దోమలజోరు, రక్తకండి, డాబుగుడ, కమలతోట గ్రామాల గిరిజనులు డిమాండు చేశారు.


Updated Date - 2020-11-06T06:02:16+05:30 IST