-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Ring nets should be banned
-
రింగ్ వలలను నిషేధించాలి
ABN , First Publish Date - 2020-12-16T05:29:44+05:30 IST
రింగ్ వలలతో స్థానిక సంప్రదాయ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని శ్రీ మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వలిశెట్టి తాతాజీ అన్నారు.

మహారాణిపేట, డిసెంబరు 15: రింగ్ వలలతో స్థానిక సంప్రదాయ మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని శ్రీ మత్స్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వలిశెట్టి తాతాజీ అన్నారు. రింగ్ వలలు నిషేధించాలని కోరుతూ 14 గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఫిషింగ్ హర్బర్ నుంచి కలెక్టరేట్ వరకు మంగళవారం ర్యాలీ చేశారు. అనంతరం డీఆర్వో ప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఎస్.జయకుమార్, కాసారపు జగదీష్, నొల్లి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.