-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Responsible for the beauty of the Ramalaya structure
-
రామాలయ నిర్మాణం అందని బాధ్యత
ABN , First Publish Date - 2020-12-27T06:29:21+05:30 IST
అయోధ్యలో రామాలయం నిర్మించే బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని పాకలపాడు గురు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి అన్నారు.

పాకలపాడు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి
కొయ్యూరు, డిసెంబరు 26: అయోధ్యలో రామాలయం నిర్మించే బాధ్యత ప్రతీ హిందువుపై ఉందని పాకలపాడు గురు ఆశ్రమ స్వామీజీ రామానంద స్వామి అన్నారు. శనివారం చింతలపూడిలో విశ్వహిందూపరిషత్, సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర ధర్మనిధి సమర్పణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామానందస్వామి రామమందిర నిర్మాణంలో హిందువుల భాగస్వామ్యంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, గెమ్మెల మోహనరావు, పనసల రామకృష్ణ, ఈరే మల్లిబాబు, సెగ్గే సన్యాసిరావు, వరలక్ష్మి, డీవీడీ ప్రసాద్, సెగ్గే అప్పారావు, కూడా ఎర్రయ్య పాల్గొన్నారు.