ఆరిలోవ అటవీ ప్రాంత రహదారి దుస్థితిపై స్పందన

ABN , First Publish Date - 2020-12-12T04:50:17+05:30 IST

ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఐదు కిలో మీటర్ల మేర కోతకు గురైన రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ డీఈ ఎస్‌.వేణుగోపాల్‌, అటవీ రేంజ్‌ ఆఫీసర్‌ అప్పలరాజు శుక్రవారం పరిశీలిం చారు.

ఆరిలోవ అటవీ ప్రాంత రహదారి దుస్థితిపై స్పందన
కోతకు గురైన రహదారిని పరిశీలిస్తున్న అధికారులు

 తాత్కాలిక మరమ్మతుకు ఆర్‌అండ్‌బీ, అటవీ అధికారులు పరిశీలన

 గొలుగొండ, డిసెంబరు 11 : ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఐదు కిలో మీటర్ల మేర కోతకు గురైన రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ  డీఈ ఎస్‌.వేణుగోపాల్‌, అటవీ రేంజ్‌ ఆఫీసర్‌ అప్పలరాజు శుక్రవారం పరిశీలిం చారు. ఈ రహదారి దుస్థితిపై ఇటీవల బీజేపీ మండల నాయకులు వంటా- వార్పు  ద్వారా సదరు రోడ్డు ప్రాంతంలో ఆందోళన చేసిన నేపథ్యంలో అధికారుల్లో కదలిక ఏర్పడింది. ఆర్‌అండ్‌బీ జేఈ ప్రసాద్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ సతీశ్‌, బీజేపీ నాయకులు ఎర్రినాయుడు, పృద్విరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:50:17+05:30 IST