-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Removal of stores at SMI office
-
ఎస్‌ఎంఐ కార్యాలయం వద్ద దుకాణాల తొలగింపు
ABN , First Publish Date - 2020-12-29T05:29:13+05:30 IST
పట్టణంలోని ఎస్‌ఎంఐ(చిన్న నీటిపారుదల శాఖ) కార్యాలయం వద్ద వున్న దుకాణాలను రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖల అధికారుల ఆధ్వర్యంలో జలవనరుల శాఖ అధికారులు సోమవారం తొలగించారు.

అరకులోయ టౌన్, డిసెంబరు 28: పట్టణంలోని ఎస్‌ఎంఐ(చిన్న నీటిపారుదల శాఖ) కార్యాలయం వద్ద వున్న దుకాణాలను రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖల అధికారుల ఆధ్వర్యంలో జలవనరుల శాఖ అధికారులు సోమవారం తొలగించారు. రహదారి విస్తరణలో భాగంగా ఎస్‌ఎంఐ కార్యాలయం వద్ద వున్న దుకాణాలను కొంచెం జరపడంతో ఆశాఖ అధికారులు ఈనెల 11వ తేదీన వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల గడువు ముగియడంతో ఆదివారం ఎక్స్‌కవేటర్ సాయంతో దుకాణాలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. కాగా, దుకాణాల తొలగింపుతో వీధిన పడ్డామని బాధిత వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.