రిజిస్ట్రేషన్స్‌ జోరు

ABN , First Publish Date - 2020-12-11T05:40:55+05:30 IST

రిజిస్ట్రేషన్ల శాఖ నవంబరులోను జోరు ప్రదర్శించింది. అక్టోబరులో విశాఖ జిల్లా(రిజిస్ర్టేషన్‌)లోని ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 5,786 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ కాగా నవంబరు నెలలో 5,677 అయ్యాయి.

రిజిస్ట్రేషన్స్‌ జోరు

డాక్యుమెంట్లు కాస్త తగ్గినా... ఆదాయం మాత్రం పెరిగింది


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రిజిస్ట్రేషన్ల శాఖ నవంబరులోను జోరు ప్రదర్శించింది. అక్టోబరులో విశాఖ జిల్లా(రిజిస్ర్టేషన్‌)లోని ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 5,786 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ కాగా నవంబరు నెలలో 5,677 అయ్యాయి. అక్టోబరులో ఆదాయం రూ.67.88 కోట్లు రాగా నవంబరులో 68.43 కోట్లకు చేరింది. విశాఖపట్నం వరకు చూసుకుంటే రిజిస్ట్రేషన్ల శాఖపై ఇప్పుడు కరోనా ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రోజూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో కోల్పోయిన ఆదాయం మెల్లగా రికవరీ అవుతోంది. 


2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కలిపి నవంబరు నెల వరకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం రూ.512.85 కోట్లు కాగా 71.26 శాతంతో ఇప్పటివరకు 365.49 కోట్లు సాధించారు. గత ఏడాది ఇదే కాలానికి రూ.382.63 కోట్ల ఆదాయం వచ్చింది. వృద్ధి రేటు -4.48గా నమోదైంది. గత ఏడాది కరోనా లేదు. ఈ ఏడాది నాలుగు నెలలు కార్యాలయాలు మూతపడినా దాదాపుగా అదే ఆదాయం రావడం విశేషం. అయితే పరిపాలన రాజఽధాని ప్రకటన, భీమిలి, ఆనందపురం, మధురవాడ కార్యాలయాల పరిధిలో లావాదేవీలు పెరగడంతో ఆ నిష్పత్తిలో ఆదాయం రావలసి ఉంది. ఆ లోటు కనిపిస్తోంది


ఈ ఆర్థిక సంవ్సతరంలో నవంబరు నెలాఖరు వరకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్య సాధనలో పెందుర్తి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం 89.38 శాతంతో మొదటి స్థానంలో వుండగా, మధురవాడ 86.96 శాతంతో రెండో స్థానంలోను, భీమిలి 85.2 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. 


ఆదాయ పరంగా చూసుకుంటే..మధురవాడ అత్యధికంగా రూ.83.54 కోట్లు సాధించింది. రూ.73.65 కోట్లతో సూపర్‌బజారు కార్యాలయం రెండో స్థానంలో, రూ.45.87 కోట్లతో ద్వారకా నగర్‌ కార్యాలయంలో మూడో స్థానంలో ఉంది.

Updated Date - 2020-12-11T05:40:55+05:30 IST