భీరం సచివాలయాన్ని సందర్శించిన ఆర్డీవో

ABN , First Publish Date - 2020-11-28T05:18:09+05:30 IST

జి.మాడుగుల మండలం భీరం సచివాలయాన్ని ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.

భీరం సచివాలయాన్ని సందర్శించిన ఆర్డీవో
పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆర్డీవో.

పాడేరురూరల్‌(జి.మాడుగుల), నవంబరు 27: జి.మాడుగుల మండలం భీరం సచివాలయాన్ని ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సిబ్బంది ప్రతీ రోజు కార్యాలయానికి వస్తున్నది? లేనిది? అడిగి తెలుసుకున్నారు. అన్నిరకాల సచివాలయ సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని ఆదేశించారు. అనంతరం నుర్మతి గ్రామంలో చేపట్టిన ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకన్నబాబు, తహసీల్దార్‌ చిరంజీవిపడాల్‌, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

Read more