కళా రంగంలో బాలు సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2020-12-20T06:05:08+05:30 IST

కళా రంగానికి ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలు చిరస్మరణీయ మని డైమండ్‌ హిట్స్‌ చైర్మన్‌ దాడి రత్నాకర్‌ అన్నారు.

కళా రంగంలో బాలు సేవలు చిరస్మరణీయం
బాలు చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న రత్నాకర్‌, తదితరులు

డైమండ్‌ హిట్స్‌ చైర్మన్‌ దాడి రత్నాకర్‌


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 19: కళా రంగానికి ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలు చిరస్మరణీయ మని డైమండ్‌ హిట్స్‌ చైర్మన్‌ దాడి రత్నాకర్‌ అన్నారు. వీవీ రమణ రైతుభారతి హాలులో శనివారం రాత్రి బాలు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా బాలు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, నటుడిగా, నిర్మాతగా సినీ ప్రపంచానికి ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

సంతాప సభలో ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, కళాకారులు కర్రి దివాకర్‌, కేఎం నాయుడు, సూరిశెట్టి రమణఅప్పారావు, కర్రి శివుడు, కొణతాల మురళీకృష్ణలతో పాటు సంగీత దర్శకుడు, కళ్యాణినృత్య సంగీత అకాడమీ వ్యవస్థాపకులు ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాస్‌ బాలుకు నివాళులర్పించారు. అనంతరం సంగీత దర్శకుడు లక్ష్మీశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గాయనీ గాయకులు ఆలపించిన ఎస్పీ బాలు స్వరాంజలి కార్యక్రమం ఎంతోగానో ఆకట్టుకుంది. 

Updated Date - 2020-12-20T06:05:08+05:30 IST