-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Ration cards maping
-
బియ్యం కార్డుల మ్యాపింగ్ వేగవంతం కావాలి
ABN , First Publish Date - 2020-12-11T04:51:02+05:30 IST
బియ్యం కార్డుల మ్యాపింగ్ వేగవంతం కావాలి

డీఎస్‌వో శివప్రసాద్
నర్సీపట్నం, డిసెంబరు 10 : బియ్యం కార్డుల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఆర్.శివప్రసాద్ సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. పెదబొడ్డేపల్లిలో గల సచివాలయాన్ని గురువారం సందర్శించి పలు సూచనలు చేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేసే ప్రక్రియ ప్రారం భం కానున్న నేపథ్యంలో మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌వో రాజు పాల్గొన్నారు.