-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ration
-
ఉచిత రేషన్ అందడం లేదు.
ABN , First Publish Date - 2020-11-28T05:16:02+05:30 IST
స్థానిక జీసీసీ డిపో సేల్స్‌మేన్ సక్రమంగా విధులు నిర్వహించడం లేదంటూ గిరిజనులు శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

డీటీకి గిరిజనుల ఫిర్యాదు
గూడెంకొత్తవీధి, నవంబరు 27: స్థానిక జీసీసీ డిపో సేల్స్‌మేన్ సక్రమంగా విధులు నిర్వహించడం లేదంటూ గిరిజనులు శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. డిపో పరిధిలో 500 తెల్ల రేషన్ కార్డులు ఉండగా ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ 27వ తేదీ నాటికి సగం మంది కూడా పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా నెట్‌వర్క్ పనిచేయడం లేదని కుంటిసాకులు చెప్పి ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన డీటీ రాజ్‌కుమార్ మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్టు వారికి తెలిపారు.