మేలు రకం విత్తనాలు ఎంచుకోండి
ABN , First Publish Date - 2020-12-30T05:38:24+05:30 IST
చెరకు రైతులు మేలురకం విత్తనాలు ఎంచుకోవాలని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ భరతలక్ష్మి సూచించారు.

అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ భరతలక్ష్మి
తుమ్మపాల, డిసెంబరు 29: చెరకు రైతులు మేలురకం విత్తనాలు ఎంచుకోవాలని ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ భరతలక్ష్మి సూచించారు. తుమ్మపాలలో మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చెరకు తోటలో పశువుల ఎరువులను తప్పనిసరిగా వేయాలన్నారు. వరి వేసే రైతులు విత్తనోత్పత్తి చేసుకోవడం మంచిదన్నారు. మొక్కజొన్న వేసే రైతులు జీరో టిల్లేజ్ పద్ధతులు పాటిస్తే దిగుబడులు బాగుంటాయని చెప్పారు. అనంతరం రైతులకు ఇంద్రావతి రకం విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో డాక్టర్ కేవీ రమణమూర్తి, ఏవో రామపద్మలత, ఆత్మ ఏటీఎం కె.రామకృష్ణ, ఏఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.