మధురవాడ సబ్ రిజిస్ట్రార్‌గా రమేశ్
ABN , First Publish Date - 2020-12-30T06:05:29+05:30 IST
మధురవాడ సబ్ రిజిస్ట్రార్‌గా తెరపల్లి రమేశ్‌ను మంగళవారం నియమించారు. అక్కడ పనిచేస్తున్న టి.తారకేశ్‌ను అమరావతిలోని ఐజీ కార్యాలయానికి సోమవారం అర్ధరాత్రి సరండర్ చేసిన విషయం తెలిసిందే.

అమరావతి వెళ్లిన తారకేశ్
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మధురవాడ సబ్ రిజిస్ట్రార్‌గా తెరపల్లి రమేశ్‌ను మంగళవారం నియమించారు. అక్కడ పనిచేస్తున్న టి.తారకేశ్‌ను అమరావతిలోని ఐజీ కార్యాలయానికి సోమవారం అర్ధరాత్రి సరండర్ చేసిన విషయం తెలిసిందే. తనను అకారణంగా సరండర్ చేశారని, అందరిలా నాన్‌ఫోకల్ ఏరియాకు బదిలీ చేసినా బాగుండేదంటూ ఆయన అమరావతిలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను కలిసి తన గోడు చెప్పుకున్నట్టు తెలిసింది. ఆ తరువాత ఐజీ శేషగిరిబాబును కూడా కలిసి తనకు న్యాయం చేయాలని కోరగా, ముందు విధుల్లో చేరాలని సూచించినట్టు సమాచారం. ఇదిలావుండగా ఓ ఉన్నతాధికారి కొన్ని డాక్యుమెంట్లు రిజిస్టర్ చేయాలని సబ్ రిజిస్ట్రార్ తారకేశ్‌ను కోరినట్టు, అవి చేయలేనని చెప్పడంతో, ఆగ్రహంతో దూషించినట్టు కొన్ని ఆడియోలు మంగళవారం టీవీ చానళ్లలో ప్రసారం అయ్యాయి. వాటిపై కూడా ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. తారకేశ్ సరండర్‌తో ఖాళీ అయిన పోస్టులో పాలకొండ సబ్ రిజిస్ట్రార్ తెరపల్లి రమేశ్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు. ఆయన అంతకు ముందు బొబ్బిలిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ పదోన్నతిపై పాలకొండ సబ్ రిజిస్ట్రార్‌గా వెళ్లారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు.